![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఏ దేవి వరమో నీవు'(Ye devi varamo Neevu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -20 లో..... అంజలి ముగ్గు వేస్తుంది. ముగ్గుపై నుంచి మనీష్ వస్తుంటే నువ్వు హీరో అయితే ముగ్గుని తొక్కకుండా రా అని అంజలి అంటుంది దాంతో ముగ్గుని తొక్కకుండా వచ్చే ప్రయత్నంలో మనీష్ బ్యాలెన్స్ ఆపుకోలేకపోతాడు. దాంతో అంజలి పట్టుకుంటుంది. థాంక్స్ అని మనీష్ చెప్తాడు. మనీష్ ఆశ్రమం విషయంలో చేసింది గుర్తుచేసుకొని మనీష్ చెయ్ వదిలేస్తుంది. దాంతో మనీష్ కిందపడతాడు.
సాయం చేసినట్లే చేసి మోసం చేస్తే ఎలా ఉంటుందో నీకు తెలియాలని ఇలా చేశానని అంజలి అనగానే ఇంకా ఆ విషయం మర్చిపోలేదా అని మనీష్ అడుగుతాడు. అసలు మర్చిపోనని అంజలి చెప్తుంది. అసలు ఈ తాతయ్యని అనాలని మనీష్ అనుకొని రాజారావు దగ్గరికి వెళ్తాడు. ఏంటి తాతయ్య నాకు టెన్షన్ అని అంటాడు. అత్తయ్య మూడు రోజుల్లో అంజలిని తీసుకొని రమ్మని చెప్పిందని మనీష్ సీరియస్ గా చెప్తుంటే రాజారావు లైట్ తీసుకుంటాడు. ఆ తర్వాత అంజలి వచ్చి నేను గుడికి వెళ్తాను తాతయ్య అని చెప్తుంది.
ఆ తర్వాత అంజలి గుడికి వెళ్తుంది. అదే గుడికి గీతాంజలి తన కూతురితో వస్తుంది. గీతాంజలి కూతురు ఫోన్ మాట్లాడుతూ కార్ లో ఉంటుంది. గీతాంజలి లోపలికి వెళ్తుంది. గీతాంజలి కూతురు కార్ డోర్ తీస్తుంటే అంజలికి తగులుతుంది. తనే అంజలిపై కోప్పడుతుంది. తను వెళ్తుంటే వెనకాల జాకెట్ బటన్ ఉడిపోతుంది. అది చూసి చూసుకోవాలి కదా అని అంజలి వెళ్లి పెడుతుంది. మరొకవైపు కన్నబిడ్డ పురిటిలో చనిపోయిందని ఒకావిడ పంతులికి చెప్తుంటే గీతాంజలి తన గతం గుర్తుచేసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |